పీజీఆర్ఎస్ ఫిర్యాదుపై అధికార బృందం పరిశీలన

KKD: ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామ రెవెన్యూ పరిధిలో నంది గుంట వద్ద ఉన్న సాగు భూమిని డిప్యూటీ తహసీల్దార్ సుబ్బరాజు ఆధ్వర్యంలో అధికార బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ భూమి అని పలువురు స్థానికులు పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో భూ యజమాని నుంచి కూడా వివరాలను సేకరించినట్లు చెప్పారు.