'మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

ప్రకాశం: అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో 13వ జిల్లా మహాసభలు కొండేపిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. కాగా, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల హక్కుల కోసం ఐద్వా అనేక పోరాటాలు చేసిందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెల 1500 పథకం అమలు చేయాలన్నారు.