థింక్ గ్యాస్ వినియోగంపై అవగాహన పెంచాలి: కలెక్టర్
ATP: భారత ప్రభుత్వం అనుమతించిన "థింక్ గ్యాస్" సేవలపై వినియోగదారులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. మంగళవారం పౌరసరఫరాల శాఖ, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అనంతపురం నగరంలో పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నా, వినియోగం తక్కువగా ఉండటంపై దృష్టి సారించాలని ఆదేశించారు.