ఓటు వేసేందుకు 2000 కి.మీ. ప్రయాణం
TG: తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ యువతి ఏకంగా 2000 కి.మీ. ప్రయాణం చేసింది. తొలిసారి ఓటు హక్కు రావడంతో గౌహతి నుంచి వచ్చిన ఆమె ఓటు వేసింది. సంగారెడ్డి జిల్లా కంది ప్రాంతానికి చెందిన అశ్విత అనే యువతి ఐఐటీ గౌహతిలో మూడో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో నేటి యువతకు ఆమె ఆదర్శంగా నిలిచింది.