రక్తదానం చేసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి

VZM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదానం చేశారు. మంత్రి శ్రీనివాస్‌తో పాటు పార్టీ నేతలు మక్కువ శ్రీధర్ పీవీబీ గోపాలరాజు రక్తదానం చేశారు. మాజీ ఎంపీపీలు గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి కొండలరావు, కొండపల్లి భాస్కరనాయుడు పాల్గొన్నారు.