VIDEO: పౌర హక్కులకు భంగం కలిగించొద్దు: ఎస్సై
VKB: సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించవద్దని ధారూర్ ఎస్సై సున్నం రాఘవేందర్ అన్నారు. మండలంలోని నాగారంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి రవీందర్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.