'ధన్-ధాన్య కృషి యోజన పథకంకు జిల్లా ఎంపిక'
JN: ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకం కింద రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన పథకానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో జనగాం జిల్లా ఎంపిక అయింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కార్యాచరణ ప్రణాళిక తయారీపై నీతి ఆయోగ్ సీఈవో ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.