TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణు నియామకం

తిరుపతి: ప్రభుత్వం ఇప్పటికే 29 మంది సభ్యులతో TTD బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సభ్యుల్లో ఒకరైన కర్ణాటకకు చెందిన మాజీ న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో తాజాగా సుదర్శన్ వేణును ఆయన స్థానంలో ప్రభుత్వం నియామకం చేసింది. ఈ మేరకు గురువారం సెక్రటరీ టు గవర్నమెంట్ డాక్టర్ ఎం. హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.