నిధులు లేక నిరుపయోగంగా తరగతి గది..!
GDWL: కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె ఎంపీహెచ్ఎస్ పాఠశాలలో నిధులు లేక పాఠశాల భవనం నిర్మాణంలోనే ఆగిపోయింది. పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల ఆవరణలో పలక బోర్డును పెట్టి తరగతులు బోధించే పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి పాఠశాలలోని భవనానికి మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.