పింఛన్ పంపిణీ పరిశీలించిన కలెక్టర్

SKLM: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గురువారం జి.సిగడాం మండలంలోని వాండ్రంగి గ్రామంలో పింఛన్ పంపిణీ తీరుపై అకస్మికంగా ఆయన పరిశీలించారు. పింఛనుదారుల ఇంటింటికి వెళ్లి నగదు అందుతున్న తీరును పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు.