VIDEO: రావులపాలెంలో మోస్తరు వర్షం

కోనసమ: రావులపాలెం మండలంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం స్తంభించింది. ఉదయాన్నే వర్షం కురవడంతో స్కూల్‌కి వెళ్లే విద్యార్థులు, వీధి వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.