జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీలకు ఎంపిక

NDL: జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీలలో పాల్గొనే ఏపీ జట్టుకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆనంద్, అరుణ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ శశికళ మంగళవారం తెలిపారు. జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీల కోసం తిరుపతిలో వారం రోజులుగా వీరు శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు.