తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

WNP: పెద్దమందడి మండల కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పురుషోత్తం రెడ్డి, వేణు యాదవ్, సేనాపతి, జంగం రమేశ్, సురేశ్ తదితరులున్నారు.