శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనున్న అధికారులు

జగిత్యాల జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీరాంసాగర్ S.E శ్రీనివాసరావు గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి గోదావరి నదికి నీటిని వదలనున్నట్లు పేర్కొన్నారు. పశువుల, గొర్ల కాపర్లు, రైతులు, మత్స్యకారులు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.