విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే?
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,20,134 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 478 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 80 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారన్నారు. 13 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనగా.. 2347 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.