'23 నుంచి వెంకన్న ఆలయంలో చతుర్థి బ్రహ్మోత్సవాలు'
E.G: దేవరపల్లిలో కొలువైన శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో చతుర్థి బ్రహోత్సవాలు ఈ నెల 23 నుంచి 27 వరకు జరుగనున్నట్లు ఆలయ కమిటి చైర్మన్ అంబటి శ్రీనివాసరావు తెలిపారు. 23న ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం సేవలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 24న ఆచార్య ఆహ్వానం, 25న స్వామి తిరువీధి ఉత్సవం, ధ్వజావరోహణం, గరుడ ప్రసాద వితరణ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.