బీజేపీని టీడీపీకి అద్దెకు ఇచ్చేశారా?: పేర్ని నాని

AP: TDP స్క్రిప్ట్‌తో మాధవ్, పురంధేశ్వరి Xలో పోస్టు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. APలో BJPని TDPకి అద్దెకు ఇచ్చేశారా అని నిలదీశారు. రాముడి విగ్రహాన్ని TDP నేతనే ధ్వంసం చేశాడని మరిచారా?, అంతర్వేది రథం కేసుపై CBI ఏం తేల్చింది?, TDP, BJP హయాంలో అనేక ఆలయాలు కూల్చేయలేదా?, పుష్కరాలు, తిరుపతి, సింహాచలం తొక్కిసలాటలు మరిచారా? అని ప్రశ్నించారు.