'ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే లక్ష్యం'
CTR: పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని డీఆర్వో మోహన కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయంలో జిల్లాలోని వివిధ డిపార్ట్‌మెంట్ అధికారులకు పల్స్ పోలియో పై కాన్వర్ జేన్స్ మీటింగ్ నిర్వహించారు. పోలియో వ్యాధి ప్రస్తుతం జీరో అయినప్పటికీ చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో ఉందన్నారు.