పారుపాక మాజీ సర్పంచ్ ఆత్మహత్య

పారుపాక మాజీ సర్పంచ్ ఆత్మహత్య

కాకినాడ: పత్తిపాడు నియోజవర్గం రౌతులపూడి మండలం పారుపక గ్రామ మాజీ సర్పంచ్ గాడి నూక రాజేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పడాల తిరుమలవెంకన్న దొర అనే వ్యక్తి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సూసైడ్ నోటు పోలీసులు తీసుకున్నట్లు అయన కుమారుడు వెల్లడించారు.