బాలికల గురుకులం తనిఖీ... సిబ్బందిపై ఆగ్రహం

బాలికల గురుకులం తనిఖీ... సిబ్బందిపై ఆగ్రహం

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఇవాళ తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో పార్థసారథి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినిలకు అన్నం ముద్దలుగా, నీళ్లకూరలు వడ్డించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని, వంటశాలలో సీసీ కెమెరాలు, ట్యూబ్ లైట్లను రిపేర్ చేయించాలని హెచ్చరించారు.