చెల్లెళ్ల కోసం ‘అమ్మ’గా మారిన అక్క!.
MDK: రామాయంపేట మండల కేంద్రంలో 13 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన బైరం లావణ్య, చిన్న వయసులోనే ఇద్దరు చెల్లెళ్ల బాధ్యతను భుజాన వేసుకుంది. తనే అమ్మగా మారి ప్రియాంకను డిగ్రీ, పూజను పీజీ వరకు చదివించి ఉన్నత స్థాయికి చేర్చడమే కాకుండా, తాను బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి సిస్టర్‌గా ఉద్యోగం చేసుకుంటు కుటుంబాన్ని సాకుతోంది.