'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
KDP: మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేంపల్లె సీఐ టి. నరసింహులు హెచ్చరించారు. ఇవాళ ఆయన తన సిబ్బందితో కలిసి వాగులు, వంకలు, పాపాగ్నీ నది ప్రాంతాలను పర్యవేక్షించారు. నదిలోకి వెళ్లకుండా ఎర్ర జెండాలు, సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.