VIDEO: మెరకముడిదాంలో విపరీతంగా కురుస్తున్న పొగ మంచు
VZM: మెరకముడిదాంలో సోమవారం పొగ మంచు విపరీతంగా కురిసింది. మంచు తెరలు తొలగకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే ప్రయాణాలు చేసే వారికి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక అవస్థలు పడుతున్నారు. రాకపోకలు సాగించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పొగ మంచు ప్రభావం వల్ల పూత పోయి తీవ్రంగా నష్టపోతున్నామని జీడి, మామిడి తోటల రైతులు వాపోతున్నారు.