జాగిర్యాల్ పాఠశాలను సందర్శించిన విద్యాధికారి
NZB: భీమగల్ మండలం జగిర్యాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విద్యాధికారి స్వామి సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించారు. పాఠశాలకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పనితీరును తనిఖీ చేశారు.