జూనియర్ సివిల్ జడ్జిగా టెక్కలి వాసి
SKLM: టెక్కలి సైనిక్ నగర్‌కు చెందిన మార్పు సాయి సృజన జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కి ఎంపిక అయ్యారు. ఈనెల 2వ తేదీన హైకోర్టు విడుదల చేసిన ఫలితాలలో ఆమె ఈ పోస్ట్‌కు ఎంపిక అయ్యారు. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో బిఎల్ చేశారు. తండ్రి నారాయణమూర్తి ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా తల్లి ఝాన్సీ లక్ష్మి గృహిణి. ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.