ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని మదనపల్లె నీరుగట్టువరిపల్లి35వ వార్డులో శనివారం ఒకరోజు ముందుగానే ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్ అందజేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు.