JCB నడిపిన కదిరి ఎమ్మెల్యే కందికుంట

JCB నడిపిన కదిరి ఎమ్మెల్యే కందికుంట

సత్యసాయి: జల సంరక్షణే లక్ష్యంగా తనకల్లు మండలం గోవిందు వారి పల్లిలో ‘మన పల్లె-మన నీరు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన చెరువు పూడిక తీత పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే జేసీబీ నడిపి అలరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.