టౌన్ ప్లానింగ్ విభాగం పని తీరుపై సమీక్ష

NZB: నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పని తీరుపై కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై నూతన భవన నిర్మాణాలకు అనుమతులు, క్రబద్దీకరణ, అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు తదితర వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.