VIDEO: ఉరుసు ఉత్సవాల తేదీలు ఇవే..!
కడప: జిల్లాలోని కమలాపురం పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు తేదీలు ఖరారయ్యాయి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి నాలుగు రోజుల పాటు భక్తి శ్రద్దలతో నిర్వహించనున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా ఇక్కడికి తరలివస్తారు. మొదటిరోజు నషాన్, 2వ రోజు గంధం, 3వ రోజు ప్రధాన ఉరుసు వేడుక, 4వ రోజు తహాలీల్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.