అభిమానులకు ముద్రగడ బహిరంగ లేఖ

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన ఆరోగ్యంపై అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. 'కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాను.. నా క్షేమ సమాచారాలపై ఆరా తీసిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. అలాగే, నా క్షేమాన్ని ఆకాంక్షించిన అభిమానులకు ధన్యవాదాలు' అని లేఖలో రాశారు. కాగా, ముద్రగడ ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.