రైల్వే ట్రాక్‌లను దాటే ప్రాంతాల్లో సబ్ వేలు: కేంద్రమంత్రి

రైల్వే ట్రాక్‌లను దాటే ప్రాంతాల్లో సబ్ వేలు: కేంద్రమంత్రి

రైల్వే ట్రాక్‌లను ప్రజలు దాటే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు సబ్ వేలు నిర్మించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వీటిలో నీరు చేరకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సుమారు 12 గంటల్లో సబ్ వేల నిర్మాణం చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. వచ్చే ఐదారేళ్లలో దేశమంతటా వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.