'ఆక్యుపేషన్ సర్టిఫికెట్ మంజూరు చేయండి'

ELR: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్‌ను కలిశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయానికి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.