ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
KMR: రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన అనిత అనే యువతి కుటుంబ సమస్యల కారణంగా ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం.. గత కొన్నిరోజులుగా అనిత తీవ్ర మనోవేదనతో బాధపడుతోందని జీవితంపై విరక్తి చెంది ఈ దారుణానికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.