మహిళ మృతి.. గంటల పాటు మృతదేహంతోనే ప్రయాణం
హాంకాంగ్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన గంటకే 60ఏళ్ల మహిళ మృతి చెందగా, పైలట్లు విమానాన్ని మళ్లించకుండా 13 గంటల ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణికుల అభ్యంతరంతో మృతదేహాన్ని గ్యాలీలో ఉంచారు. తోటి ప్రయాణికులు శవంతోనే ప్రయాణించాల్సి వచ్చింది. అయితే తమ సిబ్బంది నిబంధనల మేరకే నడుచుకున్నారని ఎయిర్‌వేస్ స్పష్టం చేసింది.