'విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం'
TG: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా ధర్మపురి నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉచిత విద్యను పొందాలని సూచించారు.