సీసీ రోడ్డు పనులకు శంకుస్ధాపన
ASR: ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ పరిదిలోని తుసపల్లి వీధిలో సర్పంచ్ వి.మోహన్ రావు సీసీ రోడ్డు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. 150 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం కొరకు 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కూటమి నాయకులు, వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.