ఘనంగా శేష వాహనంపై లక్ష్మి మాధవ స్వామిని ఊరేగింపు

కర్నులు: కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ మాధవ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి శ్రీ లక్ష్మీ మాధవ స్వామి అమ్మవాలను శేష వాహనంపై శ్రీ లక్ష్మీ మాధవ స్వామి ఆలయం నుండి ఎదురు మండపం వరకు భక్తులు ఊరేగింపుగా వాహనాన్ని లాగి స్వామివారిని స్మరించుకున్నారు.