'కేసరి వీర్' మూవీ వాయిదా

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, దర్శకుడు ప్రిన్స్ ధీమాన్ కాంబోలో 'కేసరి వీర్' మూవీ తెరకెక్కుతుంది. ఈ నెల 16న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 23న ఇది థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రం.. తుగ్లక్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు హమీర్జీ గోహిల్ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.