ఉమ్మడి జిల్లాకు నూతన సీఓఈ కాలేజీ మంజూరు

MBNR: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ)లు ఏర్పాటు కానున్నాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీఓఈ చొప్పున ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఇందులో అడ్మిషన్లను ఇస్తారు.