సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
AKP: నక్కపల్లి మండలం ఉపమాకలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సోమవారం పీఏసీఎస్ ఛైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి శంకుస్థాపన చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత చొరవతో 350 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.