అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు పట్టివేత

BDK: బూర్గంపాడు మండలం సీతారామ ప్రాజెక్టు కాలవ నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలను పట్టుకున్నట్లు ఇరిగేషన్ ఏఈ గణేష్ తెలిపారు. పట్టుకున్న లారీలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. అదే విధంగా ఎవరైనా అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.