శ్రీ కేతకిలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ కేతకిలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SRD: ఉమ్మడి జిల్లాలో మహా శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం కృష్ణ పక్షం భౌమ వాసరే పురస్కరించుకొని పార్వతీ సమేతి సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు.