VIDEO: నారాయణపురంలో ఉద్రిక్తత

VIDEO: నారాయణపురంలో ఉద్రిక్తత

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పేట మండలం నారాయణపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ టైం అయిపోవడంతో.. అధికారులు గేట్లు మూసివేశారు. అయితే, ఒక్కసారిగా గేట్లు తోసుకొని ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి దూసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో  పోలీసు అధికారులకు నియంత్రించడం కష్టమైంది. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద భయానక వాతావరణం చోటుచేసుకుంది.