VIDEO: మొలకళచెరువులో జనసేన ఆవిర్భావ వేడుకలు
అన్నమయ్య: మొలకలచెరువులో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ పోతుల సాయినాథ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి, జనసేన జెండాను ఎగురవేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూజారి సురేంద్ర, ఇతర నాయకులు, పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.