వాళ్లనూ దేవుడు నాశనం చేస్తాడు: మాజీ ఎమ్మెల్యే

వాళ్లనూ దేవుడు నాశనం చేస్తాడు: మాజీ ఎమ్మెల్యే

NDL: తనపై ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోపణలు వాస్తవమైతే దేవుడు తనను నాశనం చేస్తాడని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఇప్పుడు చికెన్, మట్టి, ఇసుకపై కమీషన్లు తీసుకుంటున్న వాళ్లనూ దేవుడు నాశనం చేస్తాడని తెలిపారు. అభిలప్రియ చేసిన ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తనపై అనవసరంగా నిందాలు వేస్తున్నారని ఆరోపించారు.