భక్తులతో సందడిగా మారిన ఆలయాలు
NLG: కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ లోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం, ఐశ్వర్య సాయి మందిరం, గీతా మందిరంతో పాటు వివిధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. మహిళలు ఆలయాలలో కార్తిక దీపాలు వెలిగించి, నోములు, వ్రతాలు ఆచరించారు. నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా భక్తులు దేవాలయాలను సందర్శించి, పూజలు చేశారు.