'తోబుట్టువు, కన్నతల్లిని వేధించడమే జగన్ పాలసీ'
AP: ఆస్తిపాస్తుల్ని ప్రేమించు.. తోబుట్టువు, కన్నతల్లిని వేధించు అన్నదే జగన్ పాలసీ అని MLA ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్ హయాంలో ల్యాండ్ గ్రాబింగ్‌లు తప్ప.. ల్యాబ్‌లు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. ఎన్ని జన్మలెత్తినా పరిహారం పొందలేని ఘోరపాపానికి జగన్ ఒడిగట్టారని తెలిపారు. దేవునితో పరాచకాలు, పదవీకాంక్ష కుట్రలు.. జగన్ ఉనికికే ప్రమాదకరమని హెచ్చరించారు.