సఖినేటిపల్లి మధ్య పంటు రాకపోకలు ప్రారంభం
W.G: నరసాపురం పట్టణం-సఖినేటిపల్లి గ్రామాల మధ్య వశిష్ఠ గోదావరిపై ప్రజా రవాణా పంటు సేవలు ప్రారంభమయ్యాయి. 'మొంథా' తుపాను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటీవల నదిపై పంటు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అయితే, వర్షాలు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి రావడంతో పంటు ప్రయాణాన్ని మళ్లీ పునఃప్రారంభించారు.