అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత

KDP: జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు మీదుగా ఇతర రాష్ట్రాలకు 700 బస్తాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. లారీ యజమానిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై ఇంకా కేసు నమోదు చేయలేదని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్సై అరుణ్ రెడ్డి తెలిపారు.