జాతీయస్థాయి కథల పోటీలకు ఎంపికైన ఆవునూరి విద్యార్థి

SRCL: ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన ఎల్సాని శృతిక రాసిన కథ జాతీయస్థాయి కథల పోటీలకు ఎంపికైంది. మాచిరాజు బాల సాహిత్యం పీఠం వారు నిర్వహించిన జాతీయ కథల పోటీల్లో ఆవునూరు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శృతిక రాసిన 'పట్టుదల ఉంటే ఏదైనా 'సాధించగలం' అనే కథ ప్రత్యేక బహుమతికి ఎంపికైంది. జాతీయ స్థాయి పోటీలకు శృతిక రాసిన కథ ఎంపిక కావడం గర్వకారణం అన్నారు.